అయ్యప్ప దీక్షలొ స్నానం యొక్క ప్రాముక్యత ఏమిటి?

కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు నిష్టనియమాలతో దీక్షను ఆచరిస్తారు. రెండు పూటలా పవిత్ర స్నానమాచరించి ఉపవాస వ్రతాలతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటారు.

  1. మాల ధరించిన భక్తులు ప్రవాహ నీటిలో స్నానం చేయడం ఉత్తమం. అలా కుదరని పక్షంలో శుభ్రమైన నీటిలో స్నానమాచరించవచ్చు.
  2. ఉత్తరం వైపు నిల్చుని స్నానమాచరించ వలెను.
  3. వీపున "భూదేవి" ఆసీనురాలై ఉండటంతో స్నానమయ్యాక ముందుగా వీపును తుడుచుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
  4. తరువాత ముఖాన్ని తుడుచుకోవాలి. ముఖంలో "మహాలక్ష్మిదేవీ" ఉంటుందని విశ్వాసం.
  5. మూడోసారిగా శిరస్సును తుడుచుకోవాలి. అక్కడ "సరస్వతీ దేవి" ఆసీనురాలై ఉంటుందని నమ్మకం.
  6. తరువాత ఛాతి భాగాన్మి తుడుచుకోవాలి. ఛాతి భాగంలో "శ్రీరాముడు" ఆసీనుడై ఉంటాడని విశ్వాసం.
  7. ఐదోసారిగా పాదాలను తుడుచుకుని, చివరిగా చేతులను తుడవాలి. పాదాల్లో "ఆంజనేయస్వామి", హస్తాల్లో శక్తి స్వరూపిణి "ఉమాదేవి" ఆసీనురాలై ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
  8. తూర్పు ముఖంగా నిల్చుని పొడిబట్టలను ధరించుకోవాలి.
 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.