భూతల శయనం అంటే ఎమిటి?

మానవులు విలాసవంతమైన జీవనము గడుపుచు సుతి మెత్తని పరుపుల పై పవళిస్తున్నారు. అందువలన నేల పై పడుకోవటం వలన కలిగే లాభాలు తెలియటంలేదు. నేల పై పడుకోవటం వలన భూమి పై ఎన్నో ఖనిజలవణాలు పరమాణువుల రూపం లో నిక్షిప్తమయి ఉన్నవి అన్ని కుడా మన శరీరం గ్రహిస్తుంది. అంతే కాక భూమి కి అయస్కాంత శక్తిగలదు అందువలన  నేలపై నిద్రించటం వలన వెన్నెముక గట్టిపడి కీళ్ళసంబంధమైన  వ్యాధులన్నియు ఉపశమనమిస్తాయి. ముక్యముగా మెడ మరియి నడుము నొప్పులకు ఈ భూతలశయనం ఎంతో  ఉత్తమమైన చికిత్సా ఫలితాలనిస్తుంది. ఎగుడు దిగుదు కొండ ప్రాంతమైన శబరిమల యత్రలో ఏమాత్రం  ఇబ్బంది లేకుండా మరియు ఎన్నో ఔషదగుణాముల చెట్లతో విలసిల్లుతూ ఏన్నోఏళ్ళూగా భక్తులు నిత్యము వెలిగించే కర్పూరం, ధూప దీపములు భస్మము అచటి నేలలో మిళ్ళితమైపోతూ శబరిమల  నేల ప్రాంతమంతా పునితమైనదని యెంచి అక్కడ నేల పై పడుకోనే భక్తులు శరీరాలు వాటిని గ్రహించి పావనమవుతాయి.

 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.