మాల ధరించకూడని సందర్బాలు ఏవి?
  • కుటుంబములో తల్లి, తండ్రి మరణించినచో ఏడాది కాలము సూతకము పాఠించవలెను. కావును ఆ కాలములో తనయులు శబరిమలకు మాల ధరించకూడదు.
  • భార్య మరణించినచో ఆరు మాసములు దీక్ష గైకొనరాదు
  • సోదరులు, పుత్రులు, పెదనాన్న చిన్నాన్న వర్గీయులు మరణిచినచో 41 దినముల వరకు దీక్ష తీసుకొనరదు.
  • అల్లుళ్ళు, మేనత్తలు, మేనమామలు, తాత, బామ్మ మున్నగు వారు మరణించినచో 30 దినములు మరకు దీక్ష తీసుకొనరాదు.
  • దాయాదులు, కూతురు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మనమళ్ళు మనవరాళ్ళు మరదళ్ళు, వదినలు మరణించినచో 21 దినములు దీక్ష తీసుకొనరాదు.
  • ఇంటీ పేరు గలవారు, రక్త సంబంధీకులు, వియ్యాలవారు మరణించినచో 13 దినములు తీసుకొనరాదు.
  • ఆత్మీయులు, మిత్రులకు మూడు దినములు దూఃఖమనుష్ఠించిన చాలును.
  • మాల ధరించి దీక్షలో యుండగా కన్నకూతురు రజస్వల అయినచో ఆ వార్త వినగానే (తాను ఎన్ని దినములు దీక్ష ముగించి యుండినను) దీక్ష విరమించి, మాల విసర్జించి, మాలను కడిగి, దేవుని సన్నిధిలో వుంచి, ఆ కార్యక్రములో పాల్గొని తన కర్తవ్య ఆచరణ చేయవలెను అదియే శ్రీ స్వామివారికి ఆనంద దాయకం, భక్తులకు శ్రేయోదాయకం.
  • తన తల్లి, భార్య, కూతురు, కోడళ్ళు మరదళ్ళు మున్నగువారు ఏడవ నెల గర్భిని అయినచో తాము మాల ధరించకూడదు. ఏలనగా దీక్షలో యుండగా వారు ప్రసవించినచో శుభసూతకం వస్తుంది, కావున మాల విసర్జన చేయవలసి యుండును, అలాగే ఋతు చక్రం తీరని యౌవ్వన స్త్రిలు ఎట్టి కారణము చేతను మాల ధరించియో లేకనో పావన శబరికొండ ఎక్కుటకు సాహసించరాదు.
 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.