|
దీక్షలో రెండుపూటలా శీతలా శిరస్నానం తప్పక చేయాలా? |
|
ఈ ప్రపంచములోని ఇతర వస్తువులన్నింటిని పవిత్రకరించే వస్తువులు రెండే రెండు, ఒకటి జలము, రెండు అగ్ని వీటిని పరిశుద్ధము చేసే వస్తువులేవి ఈ సృష్ఠిలో... లేనేలేవు. అలసిన శరీరమకు, మనస్సుకు స్నానము వలన కలిగేశాంతి, ఆహ్లాదము మనమందరికి అనుభవమే. స్నానం దేహమును పరిశుద్ధము చేసి వ్యాధిని నిరోధింపచేసి లక్షణం కూడా కలిగిఉన్నది. ఇది గ్రహించే మన పూర్వీకులు స్నానమ్మును క్ర్రమబద్దీకరించారు. శీతల జలములో సూర్యో దయమునకు ముందు చేయ శిరస్నానమ్ము ఉత్తమెత్తమైనదిగా ఆర్యులు నిర్ణంచరు. ఈ స్నానము వలన చేయు శరీరములోని రక్త ప్రసరణ సక్రమమై, శరిర ఉష్ణొగ్రత క్రమబద్దీకరమౌతుంది, అంతేగాక శరీర దారుఢ్యమునుకు, ఇరుప్రొద్దుల చేయు శిరస్నానముతో మానసిక ఆందోళన వలన మేధస్సుకు యేర్పడే ఒత్తిడులు నివారణమై, మానసిక ప్రశాంతత చేకూరి భగవత్ ధ్యనమునకు చక్కగా తోడ్పడుతుంది. అందుకే స్వామి దీక్షలో ఇరుప్రొద్దుల శీతల శిరస్నానమును నియమముగా విధించారు.
|