|
హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు.
ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.
హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
ప్రణయసత్యకం ప్రాణనాయకం - ప్రణతకల్పకం సుప్రభాంచితం ప్రణవమనీద్రం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
తురగవాహనం సుందరాననం - వరగధాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
త్రిభువనార్చితం దేవతాత్మకం - త్రినయనం ప్రభుం దివ్యదేశికం త్రిదశపూజితం చింతితప్రదం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
భవభయాపహం భావుకావహం - భువనమోహనం భూతిభూషణం ధవళవాహనం దివ్యవారణం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
కళమృదుస్మితం సుందరాననం - కలభకోమలం గాత్రమోహనం కలభకేసరి వాజివాహనం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శ్రితజనప్రియం చింతితప్రదం - శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతలాలసం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
In English:
Harivarasanam Song Lyrics - A Devotional Prayer to Lord Ayyappa Swami
Harivarasanam Viswamohanam Haridadhiswaram Aaradhyapadhukam Arivimardhanam Nithyanarthanam Hariharathmajam Devamashraye Saranam Ayyappa Swamy Saranam Ayyappa Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Saranakirtanam Bakhtamanasam Bharanalolupam Narthanalasam Arunabhasuram Bhoothanayakam Hariharathmajam Devamashraye Saranam Ayyappa Swamy Saranam Ayyappa Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Pranayasathyakam Praananayakam Pranathakalpakam Suprabhanjitham Pranavamanidram Keerthanapriyam Hariharathmajam Devamashraye Saranam Ayyappa Swamy Saranam Ayyappa Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Thuragavahanam Sundarananam Varagadhayudham Vedavavarnitham Gurukrupakaram Keerthanapriyam Hariharathmajam Devamashraye Saranam Ayyappa Swamy Saranam Ayyappa Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Tribuvanarchitam Devathathmakam Trinayanam Prabhum Divyadeshikam Tridashapoojitham Chinthithapradam Hariharathmajam Devamashraye Saranam Ayyappa Swamy Saranam Ayyappa Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Bhavabhayapaham Bhavukavaham Bhuvanamohanam Bhoothibhooshanam Dhavalavahanam Divyavaranam Hariharathmajam Devamashraye Saranam Ayyappa Swamy Saranam Ayyappa Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Kalamrudusmitham Sundarananam Kalabhakomalam Gathramohanam Kalabhakesari Vajivahanam Hariharathmajam Devamashraye Saranam Ayyappa Swamy Saranam Ayyappa Saranam Ayyappa Swamy Saranam Ayyappa
Srithajanapriyam Chinthithapradam Sruthivibhushanam Sadhujeevanam Sruthimanoharam Geethalalasam Hariharathmajam Devamashraye Saranam Ayyappa Swamy Saranam Ayyappa Saranam Ayyappa Swamy Saranam Ayyappa
|