మాలధరించిన మండల కాలములో ఉపవాస దీక్ష ఉండవచ్చునా?

శబరిమల యాత్ర విధి విధనములలో నియమిత, పరిమిత ఆహరం భుజించమన్నరే తప్ప ఎక్కడ ఉపవాస దీక్ష చెప్పబడలేదు. ఈ యాత్ర సుమారు 5 దినముల వరకు కొండలు, కోనలు, వాగులు, వంకల మధ్య కాలినడకగా నడచి వెళ్ళే యాత్ర గనుక ఆ ప్రదేశమందు మన నోటికి రుచియైన ఆహర పదార్ధములు లభ్యముకాదు. కావున ఆహార నిబంధనలు ఏర్పరచుకొని ఆయా ప్రదేశములలో లభించే ఆహర పదార్ధాలతో  సర్దుకుపోవుటకు అలవరచుకొమ్మన్నారు. అంతేగాని ఉపవాస దీక్షయుండి శరీరాన్ని నీరసింప చేసుకొని యత్ర మధ్యలో మానసిక, శారీరక బాధలకు గురికానవసరం లేదనియు తేల్చి చెప్పియున్నారు.

 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.