|
దేక్షలో ఏట్టి శుచి శుభ్రత పాటించలి? |
|
ప్రకృతి ధర్మముగా స్త్రిలకు వచ్చు ఋరుకాలము అపవిత్రమైనదిగా భావిస్తారు.. ఆ సమయంలో వారు దైవసంబంధమయిన మంత్రోచ్ఛారణము వినరాదని, భగవంతునికి సమర్పించు పూజలు, నైవేద్యములు కనరాదని పురాణాలు చెపుతాయి. అందుకే ఆ స్ధితిలో వారిని దేవాలయ ప్రాగణంలోకి గానీ, మరే ఇతర పూజా స్ధలంలోకి గానీ, వ్రతములకు, నోములకు గానీ రాకూడదని ఆర్యులు నిర్ధేశించారు. మాల ధరించి ధీక్ష తీసుకున్న అయ్యప్పలు ఆ క్షణం నుండి తమలో స్వామిని ఆవహింపచేసుకొని తామే సాక్షాత్తు అయ్యప్ప భగవానులవుతారు. తాము అయ్యప్ప స్వామి ప్రతిరూపులమనే భావనను ఆచరిస్తు దీక్షకాలమున బహిష్టు స్త్రిలను చూడకూడదని నియమం విధించారు.
|