|
దీక్షాకాలములో పాదరక్షలు ధరించరాదా? |
|
దేవాలయ ప్రాంగణంలోకి చెప్పులతో వెళ్ళని ఆచారముగల హిందూ సంప్రదాయం మనది. అలానే పవిత్రమయిన ఇరుముడిని శిరసున ధరించి అయ్యప్పస్వామి దర్శనమునకు చెప్పులతో నడక సాగిస్తు యాత్రచేయటం సత్ సాంప్రదాయం కాదని కొందరు, స్వయానా అయ్యప్పస్వామివారి సంచరించిన ప్రదేశము కనుక చెప్పులతో శబరిమల ప్రాంతముల మలినపరచరాదని తలచి మరికొదరు దేక్షాకాలం పాదరక్షలు వదలి అభ్యసము ద్వారా పాదముల క్రింది చర్మమును గట్టిపరచుకోవలెనని అర్దం చెప్తారు. అప్పుడే రాళ్ళు ముళ్ళు గల ఆ కొండ ప్రాంతములో యాత్ర సులువుగా చేయవచ్చునని ఇందులోని పరమార్ధము.
|