|
దీక్షలో ఉన్నప్పుడు-ఉదయం టిఫిన్-మధ్యానం భోజనం-సాయంత్రం టిఫిన్? |
|
ఈ శబరి దీక్షలోని ముఖ్యాంశమే నియమిత, పరిమిత, సాత్విక, సకాల ధర్మార్జన, శాఖాహరమే భుజించ వలమునన్న విధిగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏక భుక్తమే ఈ దీక్షలో విధించబడిన ముఖ్యవిధి. ఆహర నిబంధనల వలన ఉదర శుద్ధి, కాయశుద్ధి ఏర్పడి శరీరము లఘువై చెప్పినట్లు వింటుంది. సర్వరోగానికి కడుపులో పడేసిన ఆహర పదార్ధములే మూల కారణమని అంటుంది వైద్యశాస్త్రము. దీక్షా సమయములో, వేళకాని వేళలో అపరిమిత ఆహరము భుజించినచో బుద్ధి మందుగించి నిద్ర ముంచు కొస్తూంది. ఎప్పుడు పడితే అప్పుడు మల మూత్ర విసర్జనలు చేయవలసి వచ్చును. ఇవన్నియు దీక్షను భంగపరచే అవరోధములగును. కావున దీక్ష సమయములో ఆహర నిబంధనను వీలైనంత వరకు పాటించవలెను. కావున దీక్షా సమయములో ఆహర నిబంధనను వీలైనంత వరకు పాటించవలెను. ప్రస్తూత కాలాను గుణంగా పగటిపూట అన్న ఆహరము లను, రాత్రిపూట ఫలహరమును భుజించుట అలవాటులయున్నది. ఇందులో దోషమేమియు లేదు. అలాగాక ఎప్పుడు పడితే అప్పుడు ఏది దొరికితే అది తినుట యన్నది దీక్షా కాలములోనే గాక సర్వ వేళల మంచిదికాదు. అది ఆరోగ్యనికి హానికరమని గ్రహించ వలయును.
|