|
Bhagavan Saranam - భగవాన్ శరణం భగవతి శరణం |
|
భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం శరణం శరణం అయ్యప్పా
భగవానే - భగవతియే దేవనే - దేవియే ఈశ్వరనే - ఈశ్వరియే " భగవాన్ "
నలుబది దినములు దీక్షతో నిన్ను సేవించేదము అయ్యప్ప పగలు రేయి నీ నామమ్మే స్మరియించేదము అయ్యప్ప " భగవాన్ "
కరిమల వాసా పాప వినాశా శరణం శరణం అయ్యప్పా కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్ప " భగవాన్ "
మహిషి సంహారా మద గజ వాహన శరణం శరణం అయ్యప్పా సుగుణ విలాసా సుందర రూపా శరణం శరణం అయ్యప్పా " భగవాన్ "
|