|
Ayyappa Swamiki Arati Mandapam - అయ్యప్ప స్వామికి అరటి మండపం |
|
స్వామియే ... శరణం స్వామియే ... శరణం
అయ్యప్ప స్వామికి అరటి మండపం కొబ్బరి మువ్వల పచ్చ తోరణం స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"
హరి హర తనయుడు అందరి దేవుడు నీల కంటునికి ప్రియ సుతుడితడు స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"
కరిమల వాసుడు కార్తికేయుడు జాతి భేదములు తెలియని వాడు స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"
పంబా వాసుడు పందళ బాలుడు ఐదు కొండలకు అధిపతి అతడు స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"
శబరి గిరీషుడు శంకర తనయుడు జ్యోతి స్వరూపుడు భూలోక నాథుడు స్వామియే - అయ్యప్పో .. అయ్యప్పో - స్వామియే "౨"
|