Ayyappa Nava Pata - అయ్యప్ప నావ పాట

నామంబు పలికితే - నావ సాగిపోతున్నది
శబరి మలై నౌక - సాగి పోతున్నది
అయ్యప్ప నౌక - సాగి పోతున్నది

నామంబు పలికితే - నావ సాగిపోతున్నది

అందులో చుక్కాని - శ్రీ మణికంటుడు
అందులో తెరచాప - మా మణి కంటుడు

నామంబు పలికితే - నావ సాగిపోతున్నది

అమ్మలారా అయ్యలారా - రండి రండి మీరు
తేడ్దేయ్య పని లేదు - తెర చాప అక్కర లేదు

నామంబు పలికితే - నావ సాగిపోతున్నది

నీరు లేకుండానే - నావ సాగి పోతుంది
డబ్బిచ్చి మీరు - ఈ నావ ఎక్కలేరు

నామంబు పలికితే - నావ సాగిపోతున్నది

జ్ఞానమనే ధనము - అందించు మీకు
కష్ట సుఖములు రెండు - ఘనమైన కెరటాలు

కదలకండి బాబు - మెదలకండి బాబు

నామంబు పలికితే - నావ సాగిపోతున్నది

 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.