|
అయ్యప్ప దీక్షలో ఎట్టి అలంకరణ చేసుకొనవలెను? |
|
విభూదిధారణ విశిష్టతలెన్నియో కలవని గ్రహించిన భక్తులు హరిహరసుతుడైన అయ్యప్పస్వామి దీక్ష లో శివప్రియమైన విభూదితో పాటు విష్ణుప్రియమైన చందనం విధిగా ధరించవలెను. చందనధారణ శరీరానికి కాంతిని, ముఖమునకు తేజస్సును కలుగజేసి మేధస్సును వికసింపజేస్తుంది. చందనదారణ చేసిన భక్తులు చూచువారికి భక్తి భావముతో కనిపిస్తారు. అంతే కాక హైందవ సాంప్రదాయంలో కుంకుమను శుభసూచనకు చిహ్నంగా మంగళకరమైనదిగా సాక్షాత్తు లక్ష్మిదేవి కి ప్రతిరూపముగా భావిస్తారు. నిత్యం కుంకుమ ధరించే భక్తులను సిరిసంపదలు వరిస్తాయని యెంచుతారు. అందుకే అయ్యప్పస్వామి దీక్షలో భక్తులు నిత్యం విభుధి, కుంకుమ, చందనములతో విలసిల్లుతూ ఇతరులకు ప్రత్యేకంగా భక్తిభావము యేర్పడు విధంగా కనపడవలేను.
|