|
దీక్షలో ఉన్న స్వాములు అన్నదానం తప్పకుండా చేయవలేనా? |
|
అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. ఆకలిగా ఉన్నవారికి అన్నంబెట్టి సంతసించటయే అన్నదానం లేక అన్నసంతర్పణ అంటారు. ఈ ఒక్కటి మాత్రమే మనుషుల నోటి నుండి చాలు చాలు అని అనిపించగలదు. జీవుల లోని జీవనానికి జీవం పోసి వాటికి మనుగడనిచ్చేది అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపమని పురాణాలు చేబుతున్నాయి. జ్ఞానులంతా అన్నమును బ్రహ్మరసమును విష్ణువు, భోక్తతను మహేశ్వరుని స్వరుపములుగా అభివర్ణిస్తారు. మనము చేసే అన్నదానం తో త్రిముర్తులు సంతుష్టులవుతారని వారి భావం. దానాలన్నిటా అన్నదానం శ్రేష్టమైనదని గ్రహించి దీక్షా కాలములో అన్నదాన ప్రియుడైన అయ్యప్పస్వామిని సంతిష్టపరచు విధమున భక్తులు వారి వారి స్థోమతకు తగినట్లు అన్నదానం చేసీ అ అయ్యప్ప స్వామికి ప్రీతిపాత్రులౌతారు.
|