Akhila Bharatha Ayyappa Seva Sangam

అఖిలభారత అయ్యప్ప సేవా సంఘం

ఈ అఖిల భారత అయ్యప్ప సేవా సంఘాన్ని 53 ఏళ్ల క్రిందట అధికార పూర్వకంగా స్థాపించబడింది. అయ్యప్పస్వామి భక్తుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పబడింది. ఇచ్చట కుల, మత వర్ణ విభేదాలతో నిమిత్తం లేదు. భక్తులందరిని సమానంగా గౌరవిస్తారు.

పాఠశాలలు, గ్రంధాలయాలు, హాస్పిటళ్లు మరెన్నో అత్యవసర గృహాలను అందుబాట్లో ఉన్నాయి. ఇక్కడే "శ్రీ అయ్యప్ప'' అనే మళయాళ పత్రిక మరియు "ఓం శ్రీ అయ్యప్ప'' అనే తమిళ్‌ పత్రికను ముద్రించి ప్రజలకు అందజేస్తున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక సేవా శిబిరాలను నిర్వహించి యాత్రికులను విశిష్టంగా ఆకట్టుకుంటున్నారు. ఎరుమేలి, అళుతా, ఇచ్చిప్సరకోట, కరిమల, చెంగన్నూర్‌ త్రివేణి, పంపా, అప్పాచ్చిమేడు మొదలగు ప్రధాన స్థలాలలో ఈ శిబిరాలు నిర్వహించబడును. భక్తులకు కావలసిని వైద్య సదుపాయాలు మరియు ప్రమాదంలో ఉన్నవారిని ఆదుకునేందుకు అంబులెన్సులు అందుబాట్లో ఉంటాయి.

టెలిఫోన్ల సౌకర్యం మరియు ఆర్థికంగా ఆదుకునేందుకు కావలసిన కార్యాలయాలు అందుబాట్లో ఉంటాయి. భజనలు, ప్రవచనాలు, అయ్యప్ప భక్తి గీతాలు దివ్యాతి దివ్యంగా కొనసాగుతుంటాయి. భక్తులు అన్నదానం చెయ్యాలని ముచ్చటిస్తే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ వారిని సంప్రదిస్తే అందుకు కావలసిన వివరాలు, అవసరాలు తీరుస్తారు.

సంప్రదించవలసిన చిరునామా
అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం
ఫోర్టు, తిరువనంతపురం
కేరళ, ఇండియా
పిన్‌కోడ్‌: 695023

 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.