108 సంఖ్యా బలమేమిటి?

సర్వాంతర్వామి, సకల జీవకోటి వ్యాపకుడు, అమిత నామధేయుడైన భగవంతుని భక్తులు  నామాలతో పూజి వివిధ రూపాలతో సేవిస్తారు. సకల నామాలతో పూజిస్తారు. యే పేరుతో పిలిచినను భక్తజన చిత్తస్వపుడైన ఆ సర్వేశ్వరుదు వారివారి మనోభీష్ఠ్ ప్రకారం ప్రసన్నడౌతాడు. అలా వారి చిత్తం ప్రకరం ప్రత్యేక పేర్లతో పిలువబడే స్త్రి, పురుస దేవతలందరి సేవకు మహర్షులు, యోగులు పూజా విధానములో భాగంగా సహస్రనామావశి అస్టొత్తర నామావశిని రూపొందించారు. పూజా క్రతులలో ఈ నామార్చనకు 108 పూసలు గల (రుద్రాక్ష, తులసి, గంధం ) మాలను జపమాలగా చేతిలో ధరించి, ఒక్కొక్క  పూసకు ఒక్క  పేరును ఆపాదిస్తూ భగవమ్రుని ధ్వనిస్తారు. శక్తి సాధనకు 15,మోక్షాభిలాషి మరియు పుత్రసంతానాభిలాషి 25, ఆరోగ్య రక్షణకు 27, ధనాభిలాషి 30 పూసలు గల మాల జపమాలగా వాడవలెనని భనవత్ సాక్షాత్కారముతో పాటుసంపూర్ణ ఫలము పొందగోరువారు 108 పూసలు గల మాల వినియోగించవలెనని యోగీశ్వరులు మాలల వినియోగమునకు పూసల సంఖ్యలను నిర్ధేశించారు. అందుకే పూర్ణ ఫలితాన్నిచ్చే 108 పూసలు గల మాల మెడలో ధరించి దీక్షకాలము  అయ్యప్పస్వామిని జపించవలెను. ఇలా కంఠమున ధరించిన మాల భక్తుని హృదయము  (వక్షస్తలము ) పై నివాసమేర్పరచు కొని త్రికరణశుద్ధిగా భగవంతుని ధ్యానించుటకై ఆత్మ నిగ్రహమేర్పరచును.

 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.