|
ఇరుముడి టెంకాయనందు నెయ్యి ఎవరెవరు పోయవచ్చును? |
|
ఎవరెవరు అని అడిగారేమిటి? దీనిని బట్టి మీ ప్రాంతంలో ఎవరంటే వాళ్ళు ఇరుముడి టెంకాయలో నెయ్యి పోస్తుంటారని అర్ధమనుచున్నది. సాక్షాత్ పరమాత్ముడైన స్వామి అయ్యప్పకు అభిషేకము చేయుట కొరకై కొబ్బరికాయలో పూరింప బదే నెయ్యిని మండలకాల బ్రహ్మచర్య దీక్షాదక్షులు మాత్రమే పోయవలెను. ఇంకెవరైనను నెయ్యి యిచ్చినను లేక ఇంకెవరి కోర్కెలను తీర్చుట కొరకైనా మ్రొక్కుబడి యుండినను వార్లను కాదనక వారి తరుపున దీక్షాదక్షులే పూరించి నెయ్యి టెంకాయను తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేయవచ్చును. అంతేగాని ఎవరుపడితే వారు ఇరుముడి కాయలో నెయ్యి పోసిన దోషము వాటిల్లునని గ్రహించవలయును.
|