అమృత బిందువులు
  • పవిత్రత అపవిత్రత అన్నభావాల్ని మనసులోజొరనీయక సదా భగవన్నామా స్వాదనలో మత్తిలి ఉండుటయే స్వధర్మం.
  • భగవన్నామం చేస్తే - మంత్ర జపం చేసిన ఫలం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, తపస్సులు చేసిన ఫలమూ ప్రాప్తిస్తుంది.
  • భగవంతుని నామంలో అచ్చమైన మాధుర్యమున్నది. భగవంతునిలో భయ విస్మయాల్ని కలిగించే గుణాలున్నాయి. అందువల్ల అతని నామం అతనికంటే ఎంతో మధురం.
  • నామజపం చేయండి. భక్తుల్ని సేవించండి. జీవులుపట్ల దయ జూపండి. దయగల హృదయమే భగవన్నిలయం.
  • ఇంద్ర చంద్రాది దేవతలంతా తల్లి శరీరంలో కేంద్రీకృతమై ఉన్నారు. కనుక తల్లిదండ్రులను గౌరవించటం ప్రతివారి కర్తవ్యం.
  • భార్య సహధర్మచారిణి కానీ కేవలం భోగ వస్తువు కాదు. ధర్మార్ధకామ మోక్షాలలో ఆమెను అలా గౌరవించాలి.
  • పవిత్రమైన నిస్వార్ద ప్రేమ మత్రమే భగవంతడిని కొనగలుగుతుంది. ప్రాపంచిక వస్తువుల మీద ప్రేమ కామం వంటిది. కామం-ఇనుము వంటిది. ప్రేమ-బంగారం వంటిది. కనుక సర్వజగత్తును భగవద్రూపంగా నిస్వార్దంగా ప్రేమించి భగవంతుణ్ణి పొందండి. ప్రేమకు మారు రూపం భగవంతుడే.
  • బానిసకు బాధలెక్కువ. స్వతంత్రుడికి బాధ్యతలెక్కువ.
  • కష్టపడి పనిచేయడం భగవంతునికి శరీరం చేసే ప్రార్ధన.
  • శక్తిసంపన్నులకు, మహాత్ములకు కార్యసాదనకు ఆడంబరమైన సాధన సంపత్తితో పనిలేదు. పనిచేయటయే వారిపని.
  • ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్దకత. ఆచరణే ప్రధానం.
  • ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు. ఎదురు నడుస్తూ పోవడమే కర్తవ్యం. కర్తవ్యానికి వెనుకడుగులుండవు.
  • బాధనుండి మనిషి చేసే కృషికి విలువ పెరుగుతుంది.
  • అద్భుత విజయం వెనుక రహస్యం కేవలం కష్టించి పనిచేయడమే.
  • చాలామంది వ్యక్తులు పుణ్యఫలమైన సుఖాన్ని కాంక్షిస్తారే కాని పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నించరు.
  • ఇతరులలో నీవు ఎత్తి చూపే లోపం నీలో లేకుండా చూసుకో.
  • ఒప్పు ఏమిటో చేప్పే పరిజ్ఞానం ప్రతివారికీ లేకపోవచ్చు గాని, తప్పును గుర్తించగల జ్ఞానం అందరికి ఉంటుంది.
  • కష్టాలలోనే కటిక నిజాలు భోధపడుతూ ఉంటాయి.
  • ఏపనినైనా మూడుగంటలు ముందు చేయడంలో తప్పు లేదు కాని ఒక్కక్షణంకూడా ఆలస్యం చేయకూడదు. అలస్యం అమృతం విషం.
  • ఇతరుల కొరకు జీవించేవారే నిజంగా జీవించేవారు. మిగిలిన వారు మృతప్రాయులే. పరోపకారారైయిదం శరీరం.
  • లాభం పొందడానికి అసలైన మార్గం అత్యాశ వదులుకోవడమే దురాశ దఃఖమునకు చేటు.
  • ఈ ప్రపంచంలో సాదారణంగా సత్పురుషులే ఎక్కువ బాధలు అనుభవిస్తారు. పడ్డవారు చెడ్డవారు కాదు.
  • వ్యక్తిగత ఇష్టాయిష్టాలను అదిగమించి అసత్యన్ని ఎదుర్కోనడమే మానవుడి కర్తవ్యం. సత్యమేవజయతే!
  • మనస్సు, వాక్కు, శరీరం - ఈ మూడింటి మధ్య ఏకత కుదిరినప్పుడే సత్పురుషుడు కాగలడు. అదియే త్రికరణ శుద్ధి.
  • ఉన్నత మనస్కుడు ఒకరిని అవమానించడు. అవమానాన్నిసహించడు. అతడే అసలైన ఆత్మాభిమాని.
  • అసూయ, అత్యాశ, కోపం, పరుషమైనమాట - ఈ నాలుగు వదిలిపెట్టినవాడే సజ్జనుడు. సజ్జనుల లక్ష్యనమిధియే.
  • తప్పులనుంచి, లోపాలనుంచి భవిష్యత్తుకు పనికొచ్చే పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం. అనుభవం  
    ఒక పాఠశాల వంటిది. అందరం అందులో విధ్యర్ధులే.

(ఈ అమృత బిందువులు మనకు బి.సేతురామన్ గురుస్వామి గారు అయ్యప్ప విజయం అనే బుక్ లొ ప్రచురించారు)

 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.