|
భూతనాథ సదానంద సర్వ భూత దయాపర! రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః
స్వామియే శరణం అయ్యప్పా అనే శరణ ఘోషలు ఆంధ్ర ప్రాంతమంతా మిన్నుమిట్టుతున్నాయి. ఎక్కడ చూసినా నల్లని వస్త్రాలు ధరించిన స్వాములు నిష్టానియమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పల్లవింపజేస్తున్నారు. భక్తితో తెల్లవారుఝాముననే లేచి చన్నీటిస్నానాలతో వారు భగవద్ భావనలో మునిగితేలుతూ మన సాంప్రదాయాన్ని అందులోని విశిష్టతనూ సజీవంగ నిలుపుతూవున్నారు. ఆర్తులకండదండగా నిలచిన ఆదత్తమూర్తి అయ్యప్పగా వెలసి గాడి తప్పుతున్న మానవాళికి సద్బోధచేసి మనుషుల లక్ష్యమెమిటో గుర్తుచేస్తున్నాడు. కలిమాయా ప్రభావానికి లోనై తమ ధర్మలను మరచిన మనుషులను ఆమాయా ప్రభావాన్నుంచి రక్షించడానికే ఆ శబరిగిరివాసుడు అఖండబ్రహ్మచర్యా దీక్షానిబద్ధుడై మార్గదర్శనం చేస్తున్నాడు.సమస్త మానవాళి సన్మార్గం వైపు మల్లేవరకు ఆదివ్య మకరజ్యోతి అలా దారి చూపిస్తూనే వుంటుంది. అదే ఆ అవతార లక్ష్యంకూడా. తమసోమా జ్యోతిర్గమయ. స్వామియే శరణం అయ్యప్పా. |
|
|
అయ్యప్ప దీక్ష.కం వెబ్ సైట్ గురించి: |
|
అయ్యప్ప దీక్ష.కం వెబ్ సైట్ గురించి (About AyyappaDeeksha.com):
- ఈ వెబ్ సైట్ తెలుగు అయ్యప్ప భక్తుల కోసం రూపొందించడమైనది.
- అయ్యప్ప గురించి, స్వామి దీక్ష గురించి, దీక్ష నియమాల గురించి క్లుప్తంగా ఈ వెబ్ సైట్ లొ వివరించడం జరిగింది.
- మీ మీ ప్రాంతాలలొ జరుగు పడి పూజ వివరాలను, అన్నధాన వివరాలను, భజనా కార్యక్రమ వివరాలను మాకు తెలియజెసిన యెడల, మేము ఆ వివరాలను ఈ వెబ్ సైట్ లొ పొందుపరచగలము. మరియు మీ ఫ్రాంతాలకి దగ్గరలొ ఉన్న అయ్యప్ప భక్తులకు ఈ వివరాలని ఈమైల్ ద్వారా తెలియజెస్తాము.
- అంతే కాకుండ, మీ యొక్క పడి పూజకి సంభందించిన ఫొటోలని, వీడియొలని మాకు పంపిన యెడల మేము ఈ వెబ్ సైట్ లొ పొందుపరచగలము. తద్వార వివిద ప్రాంతాలలొని అయ్యప్ప భక్తులు వీక్షించెదరు.
- 18 సంవత్సరాలు దీక్ష పూర్తి చేసిన భక్తుల (గురుస్వాముల) వివరాలను మాకు తెలియచేయండి. వారి వివరాలను, వారి అనుభావాలను ఈ వెబ్ సైట్ లొ పొందుపరచగలము.
- ఇంకా మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.
మీరు సంప్రదించవలసిన వివరాలు: అశోక్ కుమార్ (స్వామి) ఫొన్: +91.9885400904 కుకట్ పల్లి, హైదరాబాద్ |
|
|